Site icon HashtagU Telugu

Hijab Row: సుప్రీంకోర్టుకు చేరిన.. క‌ర్నాట‌క‌ హిజాబ్ వివాదం

Hijab Supreme Court

Hijab Supreme Court

క‌ర్నాట‌కలో ర‌చ్చ లేపుతున్న‌ హిజాబ్ వివాదం పై, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన‌ మధ్యంతర ఉత్తర్వులను నిలిపేలంటూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ వివాదం పై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌ప‌గా, తుది తీర్పు వచ్చేంత వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.

ఇక‌ కర్ణాటకలో క‌ల‌క‌లం రేపిన హిజాబ్ వివాదం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌ల‌కు తెర‌లేపిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కర్ణాటకలోని అనేక‌ విద్యాసంస్థల్లో ఓ రేంజ్‌లో ఈ అగ్గి రాజుకుంది. దీంతో ఈ హిజాబ్ వివాదం పై ఇటీవ‌ల కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో తుది తీర్పు వచ్చేంత వరకూ కళాశాలల్లో యూనిఫారంలను మాత్రమే ధరించాలని పేర్కొంటూ, సోమవారం నుంచి క‌ర్నాట‌క‌లోని అన్ని విద్యాసంస్థలను తెరవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే తాజాగా దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు కావడంతో, ఈ హిజాబ్ వివాదం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. మ‌రి సుప్రీంకోర్టు నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.