Site icon HashtagU Telugu

Temperature : కొత్త‌గూడెంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త న‌మోదు

Heatwave

Heatwave

తెలంగాణ‌లో ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్రంలో అత్య‌ధికంగా కొత్త‌గూడెంలో ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బుధవారం గరిష్టంగా 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ సీజన్‌లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుకెక్కింది. పగటి ఉష్ణోగ్రత 43.1 నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటంతో 16 మండలాలు వార్నింగ్ జోన్‌లోకి వచ్చాయి. పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా బయ్యారం వద్ద జిల్లాలోని గరిమెళ్లపాడు వద్ద 45.4 ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రత 43.1 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవడంతో జిల్లాలోని తొమ్మిది మండలాలు వార్నింగ్‌ జోన్‌లోకి వచ్చాయి. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 1952లో భద్రాచలంలో 48.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉష్ణోగ్ర‌త‌లు పెరగడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు

Exit mobile version