Chandrababu : పుంగనూరు లో అడుగడుగునా చంద్రబాబు ను అడ్డుకుంటున్న వైసీపీ శ్రేణులు

ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. ‘పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా?’ అంటూ ప్రశ్నించారు.

  • Written By:
  • Updated On - August 4, 2023 / 07:43 PM IST

పుంగనూరు లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు (Chandrababu) పర్యటన ను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడమే కాదు ఆయనఫై రాళ్లు రువ్వారు. పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ..ఎలాంటి చర్యలు తీసుకపోవడం ఫై టీడీపి అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు (Punganur) బయల్దేరిన చంద్రబాబు.. కురబలకోట మండలం అంగళ్లు కూడలి వద్దకు చేరుకోగానే.. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకుంటామంటూ.. రోడ్డుపైకి వచ్చారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో టీడీపి కార్యకర్తలకు గాయపడ్డారు.అలాగే టీడీపి శ్రేణుల వాహనాలను వైసీపీ (YCP) శ్రేణులు దగ్ధం చేసారు.

ఈ ఘటన ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైసీపీ (YCP) శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ (TDP) కార్యకర్తలకు చికిత్స చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. ‘పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా?’ అంటూ ప్రశ్నించారు. తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానన్నారు. టీడీపీ కార్యాకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి చేసారని వర్ల రామయ్య అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా వైసీపీ గూండాలు వ్యవహరించడంతో పాటు, టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడ్డారు. టీడీపీ నాయకులకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లను ధ్వంసం చేసి తగలబెట్టారు. గతంలో కూడా ఇటువంటి దాడులు నందిగామ, ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై జరిగాయి. అయినా పోలీసులు వీటిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని వర్ల మండిపడ్డారు.