Site icon HashtagU Telugu

YS Viveka Murder Case: వివేక హత్య కేసులో కీల‌క ప‌రిణామం..వాళ్ళిద్ద‌రికి షాక్..!

Vivekananda Reddy

Vivekananda Reddy

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వివేకానంద‌రెడ్డి హత్య కేసులో ముఖ్య‌ నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను తాజాగా హైకోర్టు కొట్టేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్ర‌మంలో వాళ్లిద్దరూ వేసిన పిటిషన్‌, ఈరోజు విచారించిన హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది. ఇక ఈ హత్య కేసులో తమను సీబీఐ అన్యాయంగా ఇరికించిందని, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు గతంలో కూడా కోర్టును ఆశ్ర‌యించారు. మ‌రోవైపు వివేకా హ‌త్య కేసులో భాగంగా, సీబీఐ విచార‌ణ రెడురోజుల క్రితం మ‌ళ్ళీ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పులివెందుల‌లో వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితుల‌ను సీబీఐ అధికారులు విచారించారు.