Site icon HashtagU Telugu

High court: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Template (9) Copy

Template (9) Copy

జాగరణ దీక్ష సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించాడంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కరీంనగర్ కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నేడు తిరస్కరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదంటూ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.