Site icon HashtagU Telugu

High Alert: తెలంగాణాలో హైఅలర్ట్.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు?

Telangana Rains

Telangana Rains

High Alert: తెలంగాణలో వర్షాలు ఆగటం లేదు. రాష్ట్రానికి వరుణుడి గండం ఇంకా పొంచి ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ సైతం పలు జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నట్లు అలర్ట్ చేసింది. దీంతో అక్కడి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు అక్క డకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముం దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నిన్న ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వా డా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం
హెచ్చరించింది.