PFI: పీఎఫ్ఐపై నిషేధం నేపథ్యంలో దేశరాజధానిలో హై అలర్ట్…!!!

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)దాని అనుబంధ సంస్థలు ...ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు...అలెర్ట్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 06:35 AM IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)దాని అనుబంధ సంస్థలు …ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు…అలెర్ట్ అయ్యారు. పీఎఫ్ఐ నాయకులు, సిబ్బంది ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రంపై పీఎఫ్ఐపై నిషేధం విధించింది. ఐదేళ్లపాటు కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్యకలాపాలు ముమ్మరం చేశారు. డీసీపీలు వీధుల్లోకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 2020లో అల్లర్లు జరిగిన ఈశాణ జిల్లాలో కమ్యూనిటీల జనాభా ఉంది. ఈ ప్రాంతం నుంచి పీఎఫ్ ఐతో సంబంధం ఉన్న 5గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే శాంతిభ్రదతలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

రాజధానిలో సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే తక్షణ చర్యలు తీసుకోవడానికి ముందస్తు చర్యలుగా చెబుతున్నారు. నార్త్ వెస్ట్ జిల్లా డీసీపీ, ఇతర జిల్లాల డీసీపీలు వారి పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు.