Site icon HashtagU Telugu

KKR vs RR: హెట్మెయర్ కళ్లుచెదిరే క్యాచ్

KKR vs RR

Medium 2023 05 11 8aa3a73308

KKR vs RR: ఐపీఎల్ 56వ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా పవర్‌ప్లే వరకు 2 మేజర్ వికెట్లు కోల్పోయింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే తడబడింది. మూడో ఓవర్ లోనే జాసన్ రాయ్ రూపంలో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాయ్ ఎనిమిది బంతుల్లో 10 పరుగులు చేసి షిమ్రోన్ హెట్మెయర్ చేతికి చిక్కాడు. జాసన్ రాయ్ కొట్టిన బంతి గాల్లో ప్రయాణిస్తూ బౌండరీ వద్దకు చేరుకోగా హెట్మెయర్ బౌండరీ లైన్ దాటి పరుగెత్తుతూ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద హెట్మెయర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: MS Dhoni: అట్లుంటది ధోనీతోని.. ఓ రేంజ్‌లో మహి మేనియా