Site icon HashtagU Telugu

Heroine Dimple: హైకోర్టుకు చేరిన డింపుల్ హయాతి ‘కారు’ పంచాయితీ!

Police case filed on Dimple Hayathi her lawyer speak to media

Police case filed on Dimple Hayathi her lawyer speak to media

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓ అపార్ట్ మెంట్ లో తలెత్తిన పార్కింగ్ వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆమె తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వాహనాన్ని తన బీఎం డబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందన్న ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిలిచింది.  దీంతో తనపై జూబ్లీహిల్స్ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వాటిని కొట్టేయాలంటూ డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది.

తన అధికారాన్ని ఉపయోగించి ఐపీఎస్ రాహుల్ హెగ్డే తనపై కేసులు పెట్టించారని డింపుల్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కోర్టులో వాదనలు కొనసాగాయి. డింపుల్ తన బీఎండబ్ల్యు కారుతో ఐపీఎస్ అధికారి వాహనాన్ని ఢీ కొట్టినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన వివాదం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిందని తెలుపుతూ.. కారును ఢీ కొట్టిన ఫోటోలను ధర్మాసనానికి చూపించారు.

పీపీ వాదనలు విన్న న్యాయస్థానం.. ఒకవేళ విచారణకు పిలవాలి అనుకుంటే 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో డింపుల్ హయాతికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారని పీపీ వెల్లడించారు. అయితే ఈ కేసులో డేవిడ్ విక్టర్‌కు కూడా 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: American Woman: లగ్జరీ లైఫ్ కు వదులుకొని, సన్యాసం తీసుకున్న అమెరికన్ మహిళ