Site icon HashtagU Telugu

Vishal At Kuppam: కుప్పం బరిలో విశాల్.. బాబును ఢీకొట్టేనా!

Vishal

Vishal

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. ముందస్తు ముచ్చట ఇప్పట్లో లేనప్పటికీ.. ఆ దిశగా ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలనే విషయమై తర్జనభర్జనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంచుకోట కుప్పం పై వైసీపీ గురి పెట్టింది. బాబును ఎలాగైనా ఓడిచేందుకు ఇప్పట్న్నుంచే ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు విశాల్ ను కుప్పం బరిలో దించాలని భావించింది. అక్కడ విశాల్ కుటుంబానికి మంచి పేరుండటం. ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయట.  తమిళులు సైతం స్థిరపడటంతో బాబుకు సరైన అభ్యర్థి గా విశాల్ చేత పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు వైసీపీ పెద్దలు ఈ నటుడుతో చర్చలు చర్చిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కుప్పం బరిలో పోటీలో నిలిచేందుకు విశాల్ పెద్దగా ఆసక్తి చూపలేదనీ, ఏకంగా బాబుకు ప్రత్యర్థిగా నిలవడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే బాబు కంచుకోటగా పేరొందిన కుప్పంలో చంద్రబాబును ఓడించాలనుకోవడం అంత ఈజీగా కాదు. గతంలో ఆయనపై ఎంతోమంది బరిలో దిగి చిత్తుగా ఓడిపోయారు. అందుకే కుప్పం అభ్యర్థి వైసీపీకి సవాల్ మారింది. ఈ నేపథ్యంలో విశాల్ పోటీలో నిలిపి కుప్పం కైవసం చేసుకోవాలని భావించిన వైసీపీ పార్టీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

Exit mobile version