Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ (Prabhas Visits Tirumala) దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసారు.

Published By: HashtagU Telugu Desk
Prabhas Visits Tirumala

Resizeimagesize (1280 X 720) (1) 11zon

Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ (Prabhas Visits Tirumala) దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్, శ్రీ వేంకటేశ్వర వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు‌. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ప్రభాస్ ను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. దీంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులకు ఎంతో కష్టమైంది. తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. ప్రభాస్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహాం చూపారు. నేడు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో గతరాత్రి 11 గంటలకు ప్రభాస్ తిరుపతికి చేరుకున్నారు.

Also Read: ICC WTC Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్.. ఆ ఛానెల్ లో ఉచితంగా చూడవచ్చు..!

ఈరోజు సాయంత్రం 6గంటలకు ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకలో 50 అడుగుల ఆదిపురుష్ హోలోగ్రామ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఆధ్యాత్మిక ప్రవచనకర్త చినజీయర్ స్వామి ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. ఇదే వేదిక పైనుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించబోతోంది ఆదిపురుష్ యూనిట్.

  Last Updated: 06 Jun 2023, 09:42 AM IST