Site icon HashtagU Telugu

Mahesh Babu : హీరో మహేశ్ బాబు ఇంటి వద్ద కలకలం…!!

mahesh babu

mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి వద్ద కలకలం రేగింది. ఆయన నివాస ప్రాంగణంలో ఓ ఆగంతకుడు గోడపై నుంచి దూకాడు. దీంతో తీవ్రగాయాలైన ఆ వ్యక్తిని సెక్యూరిటీ గమనించి అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 81లో ఉన్న మహేశ్ బాబు నివాసంలో రాత్రి 11.30 లకు నివాస ప్రాంగణంలోని ప్రహరీ పక్కగా శబ్దం వచ్చింది. సెక్యూరిటీ వెళ్లి చూడగా ఓ వ్యక్తి గాయాలై ఉండటాన్ని గుర్తించారు.

ఇది కూడా చదవండి: ఉధంపూర్ లో భారీ పేలుళ్లు..!!

అతన్ని విచారించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్ బాబు ఇంట్లో చోరీకి వచ్చి 30 అడుగుల గోడపై నుంచి దూకాడు. నిందుతుడిని కృష్ణ(30)గా గుర్తించిన పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో మహేశ్ బాబు ఇంట్లో లేరు. సెక్యూరిటీ ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.