Hero Eddy Electric Scooter: రూ. 72వేలకే హీరో ఎడ్డి ఈ-స్కూటర్…లైసెన్స్ అక్కర్లేదు..!!

ప్రముఖ ఈ -స్కూటర్ల తయారీదారు సంస్థ..హీరో ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి లేటెస్టు మోడల్ ను ఆవిష్కరించింది. తక్కువ దూరాల ప్రయాణాలకు అనుకూలంగా...ఈ కొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

  • Written By:
  • Updated On - March 17, 2022 / 12:21 PM IST

ప్రముఖ ఈ -స్కూటర్ల తయారీదారు సంస్థ..హీరో ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి లేటెస్టు మోడల్ ను ఆవిష్కరించింది. తక్కువ దూరాల ప్రయాణాలకు అనుకూలంగా…ఈ కొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే…ఈ స్కూటర్ ను నడిపించేందుకు లైసెన్స్ అక్కర్లేదు. అంతేకాదు…ఈ స్కూటర్ ను రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పని లేదు. కమ్యూనిటీలో తిరిగేందుకు లేదా దగ్గరలోని స్టోర్లకు, కాఫీ షాపులకు వెళ్లడానికి వీలుగా ఈ స్కూటర్ ను రిలీజ్ చేసినట్లుగా హీరో ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొంది.

ధర…
ఎడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్ ధరరూ. 72,000గా నిర్ణయించింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్లో, లైట్ బ్లూ కలర్ లో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ కానీ మే లో కానీ ఈ స్కూటర్ కొనుగోళ్లకు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే ఫ్రీ బుకింగ్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫీచర్స్….
హీరో ఎలక్ట్రిక్ ఎడ్డి స్కూటర్ ఫీచర్లన్నింటిని లీక్ చేయలేదు కంపెనీ. సాధారణంగా గరిష్టం వేగం గంటకు 25కిలోమీటర్లకన్నా తక్కువగా ఉండే వాహానాలకు మన దేశంలో లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ కూడా అదే లిస్టులోకి వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ కొత్త స్కూటర్ లైసెన్స్ అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందన్న విషయంలోకూడా కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

ఈ బైక్ లో ఫైండ్ మై బైక్, ఫాలో మీ హెడ్ ల్యాంప్, రివర్స్ మోడ్, ఈ లాక్ వంటి లేటెస్టు ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిన తర్వాతే ఈ బైక్ కు సంబంధించిన ఫీచర్లను లీక్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ ను పర్యావరణ రహితంగా స్మార్ట్ స్టైలీష్ లుక్ ఫీచర్లతో వస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ ఓ ప్రకటనలో తెలిపారు.