2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్ వివరాలు ఇవిగో..

BANK HOLIDAYS : జనవరి 2026 నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇందులో జాతీయ, రాష్ట్ర పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వర్తించవని, రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. జనవరి 2026లో ముఖ్యమైన బ్యాంక్ సెలవులు జనవరి 1: న్యూ […]

Published By: HashtagU Telugu Desk
Bank Holiday's

Bank Holiday's

BANK HOLIDAYS : జనవరి 2026 నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇందులో జాతీయ, రాష్ట్ర పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వర్తించవని, రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

జనవరి 2026లో ముఖ్యమైన బ్యాంక్ సెలవులు

జనవరి 1: న్యూ ఇయర్ డే / గాన్-న్గై (కొన్ని రాష్ట్రాలు)
జనవరి 2: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ / మన్నం జయంతి
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/ మాఘే సంక్రాంతి
జనవరి 16: తిరువళ్లువర్ డే (ప్రధానంగా తమిళనాడు)
జనవరి 17: ఉజవర్ తిరునాళ్
జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి / సరస్వతీ పూజ / బసంత పంచమి
జనవరి 26: రిపబ్లిక్ డే (జాతీయ సెలవు – అన్ని రాష్ట్రాలు)

వీకెండ్స్ (బ్యాంక్ సెలవులు)

జనవరి 4: ఆదివారం
జనవరి 10: రెండో శనివారం
జనవరి 11: ఆదివారం
జనవరి 18: ఆదివారం
జనవరి 24: నాలుగో శనివారం
జనవరి 25: ఆదివారం

మీ రాష్ట్రం లేదా నగరానికి సంబంధించిన కచ్చితమైన బ్యాంక్ సెలవుల జాబితా కోసం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. బ్యాంక్ సెలవులను దృష్టిలో పెట్టుకుని చెక్ క్లియరెన్స్, లోన్ పేమెంట్స్ వంటి ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

  Last Updated: 23 Dec 2025, 11:52 AM IST