Site icon HashtagU Telugu

Helicopter With 6 Missing : హెలికాప్టర్ మిస్సింగ్.. ఆరుగురితో బయలుదేరిన 9 నిమిషాలకే గల్లంతు

Helicopter Services

Helicopter Services

Helicopter With 6 Missing : ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ మిస్సయ్యింది. దాని ఆచూకీ దొరకడం లేదు. ఐదుగురు మెక్సికన్ టూరిస్టులు,  నేపాలీ పైలట్ చెట్ బి గురుంగ్ తో కూడిన  ఆ హెలికాప్టర్  నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో అదృశ్యమైంది.  హెలికాఫ్టర్ రవాణా సేవల కంపెనీ మనంగ్ ఎయిర్ కు చెందిన 9N-AMV మోడల్ హెలికాఫ్టర్ నేపాల్ లోని సోలుఖుంబు జిల్లాలో ఉన్న సుర్కే విమానాశ్రయం నుంచి ఆ దేశ రాజధాని ఖాట్మండుకు మంగళవారం  ఉదయం 10:04 గంటలకు బయలుదేరింది. అయితే బయలుదేరిన 9 నిమిషాలకే (ఉదయం 10:13 గంటలకు) 12,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) మేనేజర్ జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ తో తమకు కాంటాక్ట్ తెగిపోయిందని(Helicopter With 6 Missing) స్పష్టం చేశారు.

Also read :  Tata-Apple iPhone : ఐఫోన్స్ ఉత్పత్తిలోకి టాటా గ్రూప్.. రూ.4942 కోట్లతో “విస్ట్రోన్” బెంగళూరు ప్లాంట్ కొనుగోలు ?

లాంజురా పాస్‌ వద్దకు హెలికాప్టర్ చేరుకోగానే.. చివరిగా  ‘హలో’ సందేశం మాత్రమే కాంటాక్ట్ సెంటర్ కు  వచ్చిందన్నారు. మనంగ్ ఎయిర్ ఖాట్మండు కేంద్రంగా పనిచేసే హెలికాప్టర్ సేవల సంస్థ. ఇది 1997లో ఏర్పాటైంది. ఈ సంస్థ చార్టర్డ్ హెలికాఫ్టర్ సేవలను అందిస్తోంది. అడ్వెంచర్ ఫ్లైట్‌లు హెలికాప్టర్ విహారయాత్రలు లేదా సాహసయాత్ర వంటి వ్యక్తిగతీకరించిన సేవలపై  మనంగ్ ఎయిర్ దృష్టి సారించింది.