Site icon HashtagU Telugu

Helicopter Crash in Kedarnath: కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్, ఆరుగురు దుర్మరణం!

Kedarnath

Kedarnath

 ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. నలుగురు ప్రయాణికులతో గుప్తకాశీ నుండి కేదార్‌నాథ్‌కు వెళుతున్న హెలికాప్టర్ గరు చట్టి సమీపంలో కూలిపోయింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. కేదార్‌నాథ్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే హెలికాప్టర్ కుప్పకూలినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అధికారులు మృతదేహాలను వెలికితీశారు.

ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేస్తూ “కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరం. నష్టం గురించి తెలుసుకోవడానికి మేము రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము” అని ట్వీట్ చేశారు.