Site icon HashtagU Telugu

Hyderabad : హిమాయ‌త్ సాగ‌ర్‌కు భారీగా చేరుతున్న వ‌ర‌ద నీరు.. మ‌రో రెండు గేట్లు తెరిచే ఛాన్స్‌

Himayatsagar

Himayatsagar

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇటు జ‌లాశ‌యాల‌న్నీ నిండుకుండ‌ని త‌ల‌పిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హిమాయత్‌సాగర్‌ మరో రెండు గేట్లను తెరిచే అవకాశం ఉంది. శుక్రవారం హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లను తెరిచి దిగువకు నీటిని వదిలారు. మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో వర్షం కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లను శుక్రవారం ఎత్తివేసి అదనపు నీటిని విడుదల చేశారు. మూసీ నదికి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తివేశారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో జూలై 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.