తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా జిల్లాలో అత్యధికంగా నల్గొండలోని కనగల్‌లో 42 మిల్లీమీటర్లు, ఘణపూర్‌లో 41, కోదండపురం వాటర్‌ప్లాంట్‌లో 37.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది
Heavy Rains : తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Rains