Site icon HashtagU Telugu

4 killed : యూపీలో భారీ వ‌ర్షాలు.. గోడ కూలి న‌లుగురు మృతి

Rains Imresizer

Rains Imresizer

యూపీలోని ఇటావాలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇటావాలో గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ ఒక భాగం కూలిపోవడంతో నలుగురు మైనర్ పిల్లలు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలుపుతూ రూ.4 లక్షల ఆర్థిక‌ సాయం ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల సహాయాన్ని అందజేయాలని ఆదేశాలు ఇచ్చామని, గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపారు.