Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. రెండు రోజుల పాటు విద్యాసంస్థ‌లు బంద్‌

Rain Alert

Rain Alert

తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కుర‌వ‌డంతో వాగులు, వంక‌లు పొంగిపోర్లుతున్నాయి. హైద‌రాబాద్ స‌హా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వ‌ర‌ద‌ల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇటు భారీ వ‌ర్షాల కార‌ణంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల‌పాటు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు.