Rains : ముంబైలో రానున్న 24 గంట‌ల‌పాటు భారీ వ‌ర్షాలు.. అరెంజ్ అలెర్ట్ ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరం, శివారు ప్రాంతాల్లోని పలు లోతట్టు

Published By: HashtagU Telugu Desk
Rain Alert

Rain Alert

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరం, శివారు ప్రాంతాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షాలు మరింతగా కురుస్తాయని ముంబై వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గత 24 గంటల్లో శాంతా క్రజ్ ప్రాంతంలో అత్యధికంగా 203.7 మిమీ, బాంద్రాలో 160.5 మిమీ, విద్యావిహార్‌లో 186 మిమీ వర్షపాతం నమోదైంది. అంధేరి, కుర్లా, ఘట్కోపర్, చెంబూర్ వంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, పూణే, కొంకణ్ మరియు మధ్య మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తున్నాయి, రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యావత్మాల్ పట్టణం కూడా భారీ వర్షాలకు ప్రభావితమైంది, అనేక ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించి నివాసితులకు కష్టాలకు దారితీసింది.

  Last Updated: 22 Jul 2023, 12:48 PM IST