Site icon HashtagU Telugu

Rains: ఢిల్లీలో దంచికొట్టిన వాన.. భవనం కూలి చిన్నారి మృతి..స్కూళ్లకు సెలవు..!!

ఆదివారం పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. దేశరాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. గత 15ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. ఢిల్లీలో ఓ భవనం కూలిన ఘటనలో చిన్నారి మరణించింది. అదే సమయంలో గురుగ్రామ్ లో చెరువులో మునిగి ఆరుగురు పిల్లలు మరణించారు. యూపీలో పలు జిల్లాల్లో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పిడుగుపాటుకు 12మంది మరనించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరికతో నోయిడా, ఘజియాబాద్, లక్నో, కాన్పూర్ సహా పలు జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

కాగా రాజధాని ఢిల్లీలో లాహోరీ గేట్ లోని ఫరాష్ ఖానా ప్రాంతంలో ఓ భవనం కూలింది. భవనంలో చిక్కుకుపోయిన వారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. గాయాలైనవారిని ఆసుపత్రికి తరలించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది. గురుగ్రామ్ కురుస్తున్న భారీ వర్షాలకు సెక్టార్ 111లోని చెరువులో స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీటమునిగి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారుల మ్రుతదేహాలను బయటకు తీశారు. వీరంతా శంకర్ విహార్ కాలనీకి చెందినవారని గుర్తించారు. కాన్పూర్ గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ జార్టీ చేసింది వాతావరణ శాఖ జిల్లా యంత్రాంగం స్కూళ్లలకు సెలవు ప్రకటించింది.

Exit mobile version