Heavy Rains In AP : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని

  • Written By:
  • Updated On - August 7, 2022 / 10:29 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తోందని అధికారులు వెల్లడించారు.దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవ‌నాలు బలంగా ఉండడంతో ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.ల‌