బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనంతపురంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అట్లూరు మండలంలో అత్యధికంగా 25, చెన్నూరులో 13.6, వంటిమిట్ట మండలంలో 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప జిల్లా సిద్దవటంలో 9.4 మి.మీ, కమలాపురం మండలంలో 6.2, వల్లూరు మండలంలో 5.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మెజారిటీ మండలాల్లో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Rain : అనంతపురం, కడప జిల్లాలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులు పాటు కొనసాగే ఛాన్స్

Hyd Rains Imresizer