Rains in AP : ఏపీకి వ‌ర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ప్ర‌భావం కార‌ణంగా ఏపీలో వ‌ర్షం పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

  • Written By:
  • Publish Date - March 23, 2022 / 05:55 PM IST

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ప్ర‌భావం కార‌ణంగా ఏపీలో వ‌ర్షం పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అండ‌మాన్ లో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బంగాళాఖాతంలో ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఫ‌లితంగా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఒక మోస్త‌రు గాలులు వీస్తాయ‌ని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల వరకు వ‌ర్ష ప్ర‌భావం ఉండ‌నుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో గురువారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో పాటు ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ సూచించింది.