Site icon HashtagU Telugu

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం

Himachal Pradesh

New Web Story Copy 2023 06 24t183508.371

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా ఎత్తైన ప్రాంతాల్లోని రాళ్లు రోడ్లపైకి కొట్టకొస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కాగా జూన్ 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు, తుపానులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు జూన్ 27, 28 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

వరదల కారణంగా కీలాంగ్ ఉదయపూర్ రహదారి దెబ్బతింది. ఈ డ్రెయిన్‌లో గత మూడు రోజులుగా నీటితోపాటు భారీగా చెత్తాచెదారం వచ్చి చేరడంతో రోడ్డుకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో కీలాంగ్ ఉదయ్‌పూర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. లాహుల్ లోయలో నది కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పట్టాన్ లోయలోని జహ్ల్మా డ్రెయిన్ గత ఐదు రోజులుగా నిరంతరం ముంపునకు గురవుతోంది.పట్టాన్‌లోయలోని నైంగహర్‌లోని నీలకంఠ డ్రెయిన్‌లో వరద పోటెత్తడంతో నైన్‌గహర్, గవాడి, చౌఖాంగ్ గ్రామాలకు చెందిన గ్రామస్తుల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చౌఖాంగ్-నైంగహర్ రహదారి కూడా దెబ్బతింది.

మరోవైపు సూరజ్ తాల్ సరస్సు సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మూసివేసిన మనాలి-లేహ్ రహదారిని పునరుద్ధరించారు. ఈ మార్గంలో డ్రెయిన్లు ఉధృతంగా ఉండడంతో పాటు కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు పరిస్థితి చాలా చోట్ల అధ్వానంగా మారింది. వీఆర్వో రోడ్ల పునరుద్ధరణలో నిమగ్నమైనప్పటికీ చాలా డ్రెయిన్లలో నీరు పెరిగింది.

Read More: Wuhan lab : వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా లీక్ కు ఆధారాల్లేవు