Heavy Rainfall : దేవుడా..హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..

సరిగ్గా ఆఫీసులు , స్కూల్స్ నుండి బయటకు వస్తున్న సమయంలో వర్షం

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 06:49 PM IST

రెండు రోజులు ఆలా గ్యాప్ ఇచ్చిందో లేదో మళ్లీ హైదరాబాద్ (Hyderabad) లో వాన (Rain) దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని భారీ వర్షం మొదలైంది.  సరిగ్గా ఆఫీసులు , స్కూల్స్ నుండి బయటకు వస్తున్న సమయంలో వర్షం  మొదలుకావడం తో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు (Heavy Rainfall) పడిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పాల్సిన పనేలేదు. నగరమంతా వారం పాటు తడిసిముద్దయింది. శుక్రవారం నుండి కాస్త తగ్గుముఖం పట్టడం తో హమ్మయ్య అని అనుకున్నారు. కానీ సోమవారం మరోసారి వరుణుడు విజృభిస్తున్నాడు. అయితే.. వాతావరణ శాఖ శనివారమే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం, సోమవారం సాయంత్రాల్లో కుండపోత వర్షం కురవొచ్చని … అందుకు తగ్గట్టుగానే నిన్న రాత్రి భారీ వర్షం కురువగా.. ఈరోజు మరోసారి వర్షం కురుస్తుంది. ఇక నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో.. మళ్లీ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం (Traffic Jam) అయ్యింది.

ఖైరతాబాద్, లక్డీకాపూల్, దిల్‌సుఖ్ నగర్, సుల్తాన్ బజార్, అఫ్జల్ గంజ్, ఉప్పల్, లింగంపల్లి, అశోక్ నగర్, మియాపూర్, బషీర్ బాగ్, కోఠి, అబిడ్స్, బేగం బజార్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

 

Read Also : Manipur Viral Video Case : కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆ వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేశారని ప్రశ్న