Chennai Rains: చెన్నైని ముంచెత్తిన వర్షాలు..

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారు. నిన్న శుక్రవారం నుంచి చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో వర్షాలు ముంచెత్తాయి.

Chennai Rains: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారు. నిన్న శుక్రవారం నుంచి చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

చెన్నైలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లో చెన్నైలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

గత 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Also Read: CBN – Pavan : హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబుతో ప‌వన్ భేటీ.. ఉమ్మ‌డి మేనిఫెస్టోపై చర్చ‌