Rainfall Havoc Photos : వానలతో వణుకుతున్న ఉత్తరాది.. 28 మంది మృతి
Rainfall Havoc Photos : ఉత్తరాదిని వానలు వణికిస్తున్నాయి..
దీంతో జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది..
ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
వరద పోటుకు పల్లెల పట్నాల దాకా అల్లాడుతున్నాయి..
వీఐపీ కాలనీలు కూడా వరదల్లో చిక్కుకుపోతున్నాయి..
వర్షాల వల్ల సంభవించిన పలు ఘటనల్లో ఇప్పటివరకు ఉత్తరాదిలో 28 మందికి పైగా చనిపోయారు.
దీంతో పరిస్థితిని కేంద్ర హోం శాఖ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Also read : Rajamouli: మహేష్ బాబు మూవీ తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారతం”..! క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్..!
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి రంధ్రం పడింది. అందులోకి కారు దిగబడిన దృశ్యం ఇది
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా నాగవై గ్రామంలో బియాస్ నది ఒడ్డున చిక్కుకుపోయిన పౌరులను రక్షించేందుకు NDRF 14వ బెటాలియన్ సిబ్బంది సాహస కృత్యం
ఢిల్లీలోని రోడ్లపై వరద ప్రవాహం.. రాకపోకలకు వాహనదారుల అవస్థలు
ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఉన్న సుభాష్ చౌక్ వద్ద వరద నీటిలో కారుతో సహా ఇరుక్కుపోయిన వ్యక్తి