Site icon HashtagU Telugu

Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం.. నీట‌ మునిగిన ప‌లు ప్రాంతాలు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్‌, దిల్‌ సుఖ్‌నగర్‌, కొండాపూర్‌, నానక్రామ్‌గూడ, బీహెచ్‌ఈఎల్‌, రామంతపూర్‌, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వ‌ర్షానికి ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి.  మరో రెండు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు టి. బాలాజీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రానున్న మూడు గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, వికారాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది.

Exit mobile version