Site icon HashtagU Telugu

Heavy Rain : వైజాగ్‌లో భారీ వ‌ర్షం.. వైసీపీ విశాఖ గర్జ‌న‌పై సందిగ్ధ‌త‌

Rains Students

Rains Students

విశాఖ గ‌ర్జ‌న‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగిస్తున్నాడు. ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన మూడు కార్యక్రమాలు చేపట్టాయి. విశాఖ గర్జనకోసం వైసీపీ సర్వం సన్నద్ధం చేసింది. లక్ష మంది 3.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయత్రలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదారావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, రజినీ, కొడాలి నాని, రాజన్న దొర, ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్లు, జేఏసీ సభ్యులు, వివిధ సంఘాల నేతలు పాల్లొనున్నారు. అయితే వర్షం కురుస్తుండ‌టంతో గ‌ర్జ‌న‌పై సందిగ్ధ‌త ఏర్ప‌డింది. ఇటు వైసీపీ నేత‌లు మాత్రం వ‌ర్షం కురిసినా గ‌ర్జ‌న నిర్వ‌హించి తీరుతామ‌ని చెప్తున్నారు.