హైదరాబాద్ లో సోమవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు చాలా ఇబ్బందిపడ్డారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. . ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు గంటల పాటు రోడ్లపై ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా భారీ వర్షం కురవడంతో GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు.
నాంపల్లి 9.25 సెం.,మీ. ఆసిఫ్ నగర్ 8.63 సెం.మీ. ఖైరతాబాద్ 8.35 సెం.మీ. సరూర్ నగర్ 7.25 సెం.మీ., రాజేంద్రనగర్ 6.43 సెం.మీ, హిమాయత్ నగర్ 6.35 సెం.మీ. , అంబర్ పేటలో 6.15 సెం.మీ. , బహదూర్ పురా 4.7 సెం.మీ. సికింద్రబాద్ 4.45 సెం.మీ. ఉప్పల్ 4.3 సెం.మీ. షేక్ పేట4.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంబర్ పేట్ ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.