హైదరాబాద్ లో గంట నుంచి వర్షం దంచికొడుతోంది. ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్,హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, రాజేంద్రనగర్, గండిపేట, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట్ తోపాటు ఇతర ఏరియాల్లో గంట నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళ కావడంతో ఇంటికి వెళ్లేందుకు ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అంతరాయం ఏర్పడుతోంది.
Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..!!

Rains