హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తుంది..దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండ వేడి విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ లోను ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఒక్కసారిగా మారిన వాతావరణం తో రిలాక్స్ అయ్యారు. సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతుట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రోడ్లపైకి వరద వచ్చి చేరుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోవడం దీం..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యిందో అక్కడ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అటు ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంటూ రోడ్లపైకి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మణికొండ, మాదాపూర్, కేపీహెచ్ బీ, బాలానగర్ నార్సింగి, అత్తాపూర్ , మియాపూర్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Read Also : Solar Eclipse : రేపే సూర్య గ్రహణం..పొరపాటున కూడా ఈ పనులు చేయకండి