Heavy-Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..బయటకు రావొద్దంటూ హెచ్చరిక

  • Written By:
  • Updated On - September 5, 2023 / 11:17 AM IST

భాగ్యనగరం (Hyderabad) మరోసారి తడిసిముద్దవుతోంది. దాదాపు నెల రోజుల నుండి తెలంగాణ లో వర్షాలు పడకపోయేసరికి రైతులు ఆందోళనల్లో పడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని..ఒక్కసారైనా వర్షం పడితే బాగుండని కోరుకుంటున్న సమయంలో వరణుడు వరం ఇచ్చాడు. రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) పడుతుండగా..మరికొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కురుస్తుంది.

ఇక భాగ్యనగరం (Hyderabad) విషయానికి వస్తే..నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఈరోజు తెల్లవారు జామున నుండి భారీ వర్షం కురుస్తుండడం తో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షం (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ (Red alert) జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని GHMC సూచించింది.

Read Also : Dr. Sarvepalli Radhakrishnan Birthday : దేశం గర్వించిన టీచర్

మియాపూర్‌లో (Miyapur) అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక బండ మైలారంలో 13.8 సెం.మీ., దుండిగల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో 12.9 సెం.మీ., కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో 12.7 సెం.మీ., మాదాపూర్‌లో 10.7 సెం.మీ., శేరిలింగంపల్లి 11.45 సెం.మీ., షేక్‌పేటలో 11.9 సెం.మీ., బోరబండ 11.6 సెం.మీ., గాజుల రామారం 10.9 సెం.మీ., షాపూర్‌లో 10.6 సెం.మీ., బాచుపల్లి, రాయదుర్గంలో 10.1 సెం.మీ., ఖైరతాబాద్‌ 10.1 సెం.మీ., రాజేంద్రనగర్‌లో 10 సెం.మీ., గచ్చిబౌలిలో 9.6 సెం.మీ., బహదూర్‌పురా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు (Holiday) ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు (Collectors) తెలిపారు. మరోపక్క భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ (GHMC) అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్‌ (DRF) సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలన్నారు.