హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నిజాంపేట్, బోయిన్ పల్లిలో భారీ వర్షం పడుతోంది. అమీర్ పేట్, ఎస్సార్ నగర్, యూసుఫ్ గూడలో దంచికొడుతోంది. దీంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. భారీ వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. పలు చోట్ల ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ రెస్య్కూ టీం రంగంలోకి దిగి..వరద నీటిని మళ్లించే ఏర్పాటు చేస్తున్నాయి.
Hyd Rains : దంచికొడుతోన్న వర్షం..రోడ్లపై భారీగా వరద నీరు…భాగ్యనగరానికి హైఅలర్ట్..!!

Hyd Rains