Site icon HashtagU Telugu

Heavy Rain ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో రద్దైన రైళ్ల వివరాలు ఇవే..

Heavy Rain Affect Trains Ca

Heavy Rain Affect Trains Ca

అల్ప పీడన ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , వంకలు ఉప్పంగిప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చెరువులకు గండి పడి వరద ప్రవాహం ఇళ్లలోకి చేరాయి. అంతే కాదు అనేక చోట రహదారులు , రైల్వే ట్రాక్ లు తెగిపోయి రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 నిమిషాల మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటింది. అయినప్పటికి వాయుగుండం కారణంగా ఏర్పడిన భారీ మేఘాలు తెలంగాణ రాష్ట్రంపై విస్తారంగా కమ్ముకొని..చురుగ్గా కదులుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. రద్దైన రైళ్లలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు పాసింజర్‌ రైళ్లు కూడా ఉన్నాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. పూర్తయ్యేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

12713 విజయవాడ-సికింద్రాబాద్‌ (శాతవాహన)
12714 సికింద్రాబాద్‌-విజయవాడ (శాతవాహన)
17233 సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌)
12706 సికింద్రాబాద్‌-గుంటూరు (ఇంటర్‌సిటీ)
12705 గుంటూరు-సికింద్రాబాద్‌ (ఇంటర్‌ సిటీ)
17202 సికింద్రాబాద్‌-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌)
17201 గుంటూరు సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌)
20708 విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (వందేభారత్‌)
12762 కరీంనగర్‌-తిరుపతి (సూపర్‌ఫాస్ట్‌)
12704 సికింద్రాబాద్‌-హౌవ్‌డా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌)
12703 హౌవ్‌డా-సికింద్రాబాద్‌ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌)
17230 సికింద్రాబాద్‌-తిరువనంతపురం (శబరి ఎక్స్‌ప్రెస్‌)
17229 తిరువనంతపురం-సికింద్రాబాద్‌ (శబరి ఎక్స్‌ప్రెస్‌)
12862 మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం (సూపర్‌ఫాస్ట్‌)
17058 లింగంపల్లి-ముంబయి (దేవనగరి ఎక్స్‌ప్రెస్‌)
17057 ముంబయి- లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్‌)

Read Also : Monkeypox Case : పాకిస్తాన్ లో 5 కు చేరిన మంకీ పాక్స్ కేసులు