Site icon HashtagU Telugu

Drugs: ముంబాయి ఎయిర్ పోర్డులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్‌ అధికారులు సీజ్‌ చేశారు. జింబాబ్వే మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.60 కోట్ల విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. జింబాబ్వే హరారే నుండి ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్‌ బృందం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది.

కస్టమ్స్‌ అధికారులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆమె నోరు మెదపలేదు. దీంతో తమదైన శైలిలో అధికారులు విచారణ చేశారు. మహిళ తరలిస్తున్న డ్రగ్స్‌ స్కానింగ్‌కు చిక్కకుండా ప్లాస్టిక్‌ కవర్స్‌ లో ప్యాకింగ్‌ చేసి, ట్రాలీ బ్యాగ్‌ ఫైల్‌ ఫోల్డర్‌ లో దాచినట్లు అధికారుల విచారణలో నిర్థారణ అయింది. ట్రాలీ బ్యాగ్‌, ఫైల్‌ ఫోల్డర్‌ ను పూర్తిగా పగలగొట్టిన అధికారులు డ్రగ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికురాలి పై ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.