Site icon HashtagU Telugu

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో “భూ భారతి”పై వాడీవేడి చర్చ

Heated debate on "Bhu Bharati" in Telangana Assembly

Heated debate on "Bhu Bharati" in Telangana Assembly

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో భూ భారతి పై వాడీవేడి చర్చ జరిగింది. మొదట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది భూ భారతి కాదని.. భూ హారతి అని ఆరోపించారు. జమాబందీ పేరుతో ప్రభుత్వం మరో దుకాణం తెరిచిందని విమర్శించారు. ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక, రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి అని భట్టి విక్రమార్క అన్నారు. ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని అలానే చేశామని చెప్పారు.

Read Also: CBN : ఏపీ ముస్లింలు..చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నారా..?

ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలకు మాకు అధికారం కట్టబెట్టారు అని భట్టి విక్రమార్క అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. దున్నేవాడిదే భూమి అనేది సాయుధ పోరాట నినాదం. ఆ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి. ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం.. వేశాం. భూ భారతి పేరిట కొత్త చట్టం తీసుకొచ్చాం. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గతంలో కాలరాశారు అని భట్టి విక్రమార్క అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఆ పార్టీని ఓడించారు. భవిష్యత్తులో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అసత్యాన్ని సత్యం చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. వీఆర్‌ఏ, వీఆర్వోలపై గత ప్రభుత్వం ఏవిధంగా ప్రేమ చూపించిందో అందరికీ తెలుసు. వాళ్లకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం అని పొంగులేటి చెప్పారు.

Read Also: CM Chandrababu : బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దాం : సీఎం చంద్రబాబు