Site icon HashtagU Telugu

Viral Video:సీపీఆర్ తో కుక్కకు ప్రాణం పోశాడు…లక్షల మంది హృద‌యాల‌ను తాకే వైరల్ వీడియో…!!

Pic (1) (1)

Pic (1) (1)

మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి చక్కటి ఉదాహరణ ఇది. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఓకుక్కకు సీపీఆర్ చేసి…దాని ప్రాణాలు కాపాడాడు ఓ వ్యక్తి. ఎంతోమంది గుండెలను హత్తుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు చూస్తే…ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్…ఓ వ్యక్తి వీధి కుక్కకు సీపీఆర్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కనిపిస్తున్న ద్రుశ్యాలను గమనిస్తే…అపస్మారక స్థితిలో రోడ్డుమీద పడిఉన్న ఓ కుక్కను బ్రతికించేందుకు ఆయన చేసిన పోరాటం ఎంతో మంది మనస్సులను కదిలించింది. కుక్కకు తిరిగి జీవం పోయడానికి ఆయన చేసిన ప్రయత్నం…కలచివేసింది. ఎట్టకేలకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. కుక్క ప్రాణాలతో బయటపడింది.

ఈ వీడియో దాదాపు 2 లక్షల వ్యూస్ ను సంపాదించింది. నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ…అందర్నీ ప్రేమించండి…బాగా జీవించండి అంటూ ట్వీట్ చేశాడు.