Site icon HashtagU Telugu

Minister Bosta Satyanarayana : మంత్రి బొత్స సత్యనారాయణకు హార్ట్ స‌ర్జ‌రీ.. నెల రోజుల పాటు విశ్రాంతి

botsa-satyanarayana

botsa-satyanarayana

విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారిక సదస్సులో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్క‌డ ఉన్న వైసీపీ నాయ‌కులు వెంట‌నే ఆయ‌న్ని స్థానిక‌ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నంలో ప్రాథ‌మిక వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మంత్రి బొత్స సత్యనారాయణకు హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. నిన్న రాత్రి మంత్రి బొత్సకు గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం వరకూ ఆపరేషన్ జరిగింది. నెలరోజులు హైదరాబాద్‌లోనే ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ కెబినేట్‌లో మంత్రిగా ఉన్నారు.