Heart Attack: కోవిడ్-19 బాధితులు వ్యాయామాలు చేయకండి: కేంద్రం

దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇది అత్యంత ఆందోళనను కలిగిస్తుంది. ఎందుకంటే యువకులు, మధ్య వయస్కులువారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు.

Heart Attack: దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇది అత్యంత ఆందోళనను కలిగిస్తుంది. ఎందుకంటే యువకులు, మధ్య వయస్కులువారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు.

కరోనా అనంతరం యువకుల్లో గుండెపోటు కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే చోటు చేసుకున్నాయి. అప్పటివరకు సరదాగా ఉన్న వ్యక్తులు నేలకూలి మృతి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని కేసుల్లో 15 ఏళ్ళ యువకులు ఉండటం బాధాకరం. అయితే ఈ పరిస్థితిపై తాజాగా కేంద్రం స్పందించింది.

తీవ్రమైన కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటును నివారించడానికి కొంతకాలం అధిక వ్యాయామాలు చేయకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గుండెపోటుపై రీసెర్చ్ చేసింది.

Also Read: Kitchen Tips : పచ్చి మిరపకాయలను ఎక్కువరోజులు నిల్వ చేసే చిట్కాలివీ