Site icon HashtagU Telugu

Kaushik Reddy: చేనేతల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Kaushik Reddy: చేనేతల పరిస్థితి చూస్తే మనసు చెల్లించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు. మంగళవారం జమ్మికుంట లోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు స్టాక్ ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లాలోని చేనేతల వస్త్రాలు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అండగా ఉండి వారి ఉత్పత్తి చేసిన స్టాక్ మొత్తం కొనుగోలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు.

చేనేత కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా కూడా కేసీఆర్ పాలనలో ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత కార్మికులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. చేనేత కు సంబంధించిన మంత్రికి కూడా కనీసానికి వారి బాధల పట్ల అవగాహన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.

చేనేతలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలోని చేనేతలంతా కర్రు కాల్చి వాతపెట్టాలని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు తయారుచేసిన వస్తువులని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తోపాటు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.