Benefits of Gomutra : ఆవు మూత్రంలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుస్తే షాక్ అవుతారు..!!

ఆరోగ్యానికి సంబంధించి...ఏ సమయంలో ఏది సహాయపడుతుందో అంచనా వేయడం అసాధ్యం.

Published By: HashtagU Telugu Desk
Baba Ramdev Buys Punganur Cow For Rs 4 Laks

Baba Ramdev Buys Punganur Cow For Rs 4 Laks

ఆరోగ్యానికి సంబంధించి…ఏ సమయంలో ఏది సహాయపడుతుందో అంచనా వేయడం అసాధ్యం. పనికిరాని వస్తువులంటూ..తేలిగ్గా తీసిపారేసే వస్తువులే మన ఊహకు అందని లాభాలనందిస్తాయి. ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. కానీ ఆవు పేడ, లేదా గోమూత్రం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని మీకు తెలుసా. ఆరోగ్య పరంగా వీటివల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

యాంటీ మైక్రోబియల్ :
ఆవుపేడలో కొన్ని రసాయన మూలకాలు ఉంటాయి. వీటిని యాంటీ మైక్రోబియల్ అని పిలుస్తారు. క్రియాటినిన్, కార్బోలిక్ యాసిడ్, ఫినాల్, కాల్షియం, మాంగనీస్ ఉండటం చేత ఇది యాంటీ మైక్రోబియల్ గా పనిచేస్తుంది. టైఫాయిడ్, శరీరాన్ని పీడించే ఇతర క్రిముల నుంచి రక్షిస్తుంది.

యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నివారిస్తుంది:
కొన్ని బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, అవి మనం తీసుకునే మందులకు నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే మనం తీసుకునే మందులు వాటిపై పనిచేయవు. అలాంటప్పుడు ఆవు పేడ సూక్ష్మజీవుల నిరోధకతను సులభంగా అధిగమిస్తుంది.

ఆవు మూత్రం యాంటీ ఫంగల్ :
వేప, నిమ్మ రసం ప్రయోజనాల గురించి మీకు తెలుసు. వీటిని ఆయుర్వేదంలో చుండ్రు సమస్యకు ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వేప, నిమ్మకంటే ఆవు మూత్రం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. కానీ ఈ వాస్తవం చాలా మందికి తెలియదు.

మంచి క్రిమినాశక:
మీ చర్మంపై ఏవైనా గాయాలు ఉంటే, మీరు ఆవు మూత్రాన్ని ఒక ఔషధంగా ఉపయోగించవచ్చు. ఇది గాయాన్ని చాలా త్వరగా నయం చేస్తుంది. అంతేకాదు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు.

పురుగుల నివారణకు:
రౌండ్‌వార్మ్‌లతో సహా పెద్ద సంఖ్యలో ఇతర పురుగులు మానవ శరీరంలో ఉంటాయి. కానీ వాటి గురించి మనము అంతగా పట్టించుకోము. అవి మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలకు కారణం అవుతాయి. మీకు అలాంటి సమస్య ఉంటే, 2 టేబుల్ స్పూన్ల ఆవు మూత్రం తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువ:
ఆవు పేడలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరం నుండి ఫ్రీ రాడికల్ మూలకాలను కూడా తొలగించడంతోపాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో సహజంగానే క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. తాత్కాలికంగా, పూర్తిగా కాకపోయినా, క్యాన్సర్ పెరగకుండా నిరోధిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఆవు పేడలో ఉండే కొన్ని మూలికలు, ఖనిజాల ప్రభావాల కారణంగా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటుగా ఇన్ఫెక్షన్‌తో పోరాడే శరీర సామర్థ్యం పెరుగుతుంది.

Note: మీకు అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ దినచర్యలో ఆవు పేడను చేర్చుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

  Last Updated: 27 Aug 2022, 07:56 PM IST