WFH: వర్క్ ఫ్రం హోం చేస్తే….ఇన్ని రోగాలొస్తాయా…?

కరోనా మహమ్మారి రాకతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల లైఫ్ స్టైలే మారిపోయింది. ఇంటి నుంచే ఉద్యోగం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల కలిగే ప్రయోజాల కంటే నష్టాలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.

  • Written By:
  • Updated On - February 6, 2022 / 10:14 AM IST

కరోనా మహమ్మారి రాకతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల లైఫ్ స్టైలే మారిపోయింది. ఇంటి నుంచే ఉద్యోగం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల కలిగే ప్రయోజాల కంటే నష్టాలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ముఖ్యంగా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా రాకతో చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే వారు ఒకే దగ్గర కూర్చోని గంటగంటలుగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు కూర్చునంత సేపు ఏదో ఒకటి తినే వారు చాలా మంది ఉన్నారు. ఇది ఎంత ప్రమాదమో మీకు తెలుసా…కూర్చున్నంత సేపూ ఏదో ఒకటి తింటే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో అధ్యయనాలు చెబుతున్నాయి. అందూలోనూ ముఖ్యంగా కంప్యూటర్ ముందుగా ఎక్కువ సేపు కూర్చునే వారి శరీరానికి వ్యాయామం చాలా అవసరం.

ఆఫీసులకు వెళ్లి పనిచేస్తున్న వారు పదో లేక పదిహేను నిమిషాలకోసారి నడుస్తుంటారు. కానీ ఇంటి నుంచి పనిచేసేవారు ఒకే స్థలానికి అంకితమవుతున్నారు. ముఖ్యంగా కూర్చున్న దగ్గరి నుంచి కదలరు. ఇలా ఒక పాతిక సంవత్సరాలు పనిచేస్తే…మనిషి విపరీతంగా బరువు పెరుగుతారని పలు అధ్యయనాలు తేల్చాయి. అంతేకాదు ఇంకా ఎన్నో రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అవేంటో చూద్దాం.

కంప్యూటర్ ముందుకు కూర్చోవడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అలాగే గంటల తరబడి కూర్చుంటే వెన్నుముక వంగుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పాడుతాయి. హెయిల్ ఫాల్ అవుతుంది. రిపిటేటివ్ టైపింగ్ స్ట్రూన్, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు పనిచేయడం వల్ల స్కిన్ పొడిబారడం, నిర్జీవంగా మారుతుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చర్మం ముడతలు పడుతుంది.

ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేస్తుంటూ…ప్రతిరోజూ చిన్నపాటి వర్కవుట్స్…శారీరక, శ్రమ, పరుగు, నడక తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు. వర్క్ చేయాలంటే ప్రత్యేకంగా ఒక డెస్క్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. కంప్యూటర్ పై రోజుకు 6నుంచి 8గంటలు మాత్రమే సమయాన్ని కేటాయించండి.

ఇక రోజూ ఒకటి నుంచి రెండు గంటలైనా ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను చూడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు సమయాన్ని కేటాయించండి. వ్యాయమం చేయడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యంతోపాటు…మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మెదడు ఉత్తేజంగా ఉంటుంది. వీటితోపాటు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి.