Site icon HashtagU Telugu

COVID variant JN1: డోంట్ వర్రీ..కొత్త రకం కరోనాకు వ్యాక్సిన్‌ అవసరం

COVID variant JN1

COVID variant JN1

COVID variant JN1: దేశంలోకి కొత్తరకం కరోనా ఎంట్రీ ఇచ్చింది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త రకం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది: కొత్త రకం కరోనా జ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలు మరియు శరీర నొప్పులు వంటి ప్రభావాలను మాత్రమే కలిగిస్తుంది. ప్రాణనష్టం సింగిల్ డిజిట్‌లో ఉంది. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. GN1 రకం కరోనా వైరస్‌ను నియంత్రించడానికి టీకా అవసరం లేదు. చలికాలం కావడంతో జెన్1 వైరస్ వ్యాప్తి పెరిగింది. వైరస్ బాధితులు వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని ఈ మేరకు నివేదికలో పేర్కొంది. 2019 లో చైనాలో మొదటిసారిగా కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే.

Also Read: Medigadda Project : ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు