Site icon HashtagU Telugu

Telangana : కేసీఆర్‌ భజనలో ఊగిపోతున్న డాక్టర్‌ గడల శ్రీనివాసరావు

Health Director Srinivasa Rao praised cm kcr

Health Director Srinivasa Rao praised cm kcr

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు (Health Director Srinivasa Rao).. కేసీఆర్ ఫై భజన రోజు రోజుకు ఎక్కువై పోతుంది. నిత్యం కేసీఆర్ జపంలోనే ఉంటున్నాడు. కరోనా సమయంలో కరోనా జాగ్రత్తలు చెపుతూ ప్రజలకు సుపరిచితుడైన శ్రీనివాస్ రావు..పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత కేసీఆర్ భజన చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. కేసీఆర్ లేకపోతే ..తెలంగాణ లేదు..తెలంగాణ కు అన్ని కేసీఆరే అంటూ చెపుతూ వస్తున్నాడు. తాను ఓ ప్రభుత్వ అధికారినేనే విషయాన్నీ మరచి , బిఆర్ఎస్ నేతగా ఎప్పుడు కేసీఆర్ భజన చేస్తూ వస్తున్నాడు.

తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను తప్ప మరొకర్ని సీఎంగా ఊహించుకోలేమని అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో వందేళ్ల వరకు కేసీఆర్‌ (CM KCR) లాంటి నాయకుడిని చూడబోం అని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శుక్రవారం కోఠిలోని డీఎంహెచ్‌ఎ్‌స క్యాంప్‌సలో బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘమైన బీఆర్‌టీయూహెచ్‌-1 యూనియన్‌ కార్యాలయాన్ని నగర డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డితో కలిసి శ్రీనివాస్ రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో వచ్చే దఫా కూడా కేసీఆరే సీఎంగా ఉంటారు. దేశంలోనే తెలంగాణ (Telangana) నంబర్‌ వన్‌గా ఉంటుంది. మొరగని కుక్క ఉండదు.. విమర్శించని నోరు ఉండదు.. ఈ రెండూ ఉండని ఊరు లేదని’ రజనీకాంత్‌ చెప్పిన డైలాగ్స్ ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాడు ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఉన్న సమయంలో ఆయనపై మొరగని కుక్క అంటూ ఏదీ లేదని, ఆయన్ను విమర్శించని నోరు లేదని, ఆ రెండూ జరగని ఊరు, వాడ, పట్టణం ఏదైనా ఉందా? అయినా ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారుజ కేసీఆర్‌ కృషిలో భాగంగానే బంగారు తెలంగాణను నిర్మించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈయన మాటలు విన్న నెటిజన్లు , ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలు.. శ్రీనివాస్ రావు ప్రస్తుతం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ స్థానం టికెట్‌ ఆశిస్తున్నాడు. అందుకే ఇలా నిత్యం కేసీఆర్ భజన చేస్తూ..ఆయన మెప్పు పొందాలని చూస్తున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Freedom Fighters: స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తెలుగు వీరులు వీరే..!