Site icon HashtagU Telugu

Tamirind leaves: చింతచిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

Tamirind leaves

Tamirind leaves

చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింతచిగురు మటన్…ఇవన్నీ ఫేమస్ వంటకాలు. వేసవిలో విరివిగా లభ్యం అవుతుంది. పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటకాలు భలే టెస్టీగాఉంటాయి. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

చింతచిగురులో డైటరీఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఫైల్స్ తో బాధపడుతున్నవారికి చింతచిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో నులిపురుగులతో బాధపడే పిల్లలకు చింతచిగురుతో చేసిన ఆహారాన్నితినిపిస్తే మంచిది. ఉదరభాగాన్నిఆరోగ్యంగా ఉంచి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో అందుబాటులో ఉండే చింతచిగురును ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిది.

ఇక చింతచిగురులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు శరీరంలోని వ్యర్థాలు బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. చింతచిగురును తీసుకుంటే ఎర్రరక్తకణాల వ్రుద్ధి జరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. చింతచిగురులో ఉండే గుణాలు ఎముకలను బలోపేతం చేసి బలంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు చింతచిగురు పేస్టును కీళ్లపై కట్టులా కట్టుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

డయాబెటిస్ తో బాధపడేవారికి చింతచిగురు మంచి పరిష్కారంగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. డయాబెటిస్ తోవ్యాధితో బాధపడేవారు చింతచిగురును తీసుకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన గొంతు నొప్పి, మంట , వాపుల నుంచి ఉపశమనం కోసం ఉడికించిన చింతచిగురు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే మంచిది.

అంతేకాదు నోటి పగుళ్లు, పూతలను కూడా తగ్గించే గుణం ఇందులో ఉంది. చింతచిగురును తీసుకుంటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు చింతచిగురుతో చేసిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.