బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ,నటుడు అర్జున్ కపూర్ గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ జంట గురించి తరచుగా ఏదో రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలా ఈ జంటపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వెలువడ్డాయి. మరి ముఖ్యంగా వీరిద్దరి వయసు విషయంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తు ఉంటాయి. వీరిద్దరి ఏజ్ విషయానికి వస్తే అర్జున్ కపూర్ వయస్సు 36 కాగా, మలైకా వయసు 48 ఏళ్ళు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. వీరిద్దరి మధ్య లో ఏజ్ విషయం గురించి నెటిజన్స్ ప్రశ్నిస్తూ ట్రోల్స్ కూడా చేశారు.
ఈ క్రమంలోనే పలుసార్లు వీరిద్దరూ వారి ఏజ్ గ్యాప్ ట్రోల్స్ విషయం లో ఘాటుగా స్పందించారు. అయినప్పటికీ నెటిజన్స్ మాత్రం వారిపై ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో మలైకా అరోరా యోగాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మలైక అరోరా తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తన ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మలైక అరోరా ఫిట్నెస్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
ఆ వీడియోని షేర్ చేస్తూ ఇదిగో నా ప్రతిరోజు యోగ. యోగా వంటి శారీరక వ్యాయామం చేయడం,జిమ్మింగ్, పైలేట్స్. ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాలు అయిన ధ్యానం చేయడం వల్ల శ్వాసను మనస్సు మీద శాంత పరచవచ్చు అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియో పై నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.