Site icon HashtagU Telugu

Shakila: హఠాత్తుగా వచ్చి తాకకూడని ప్రదేశాన్ని తాకాడు: నటి షకీలా

Shakila

Shakila

నటి షకీలా 90, 80 కాలంలో సెక్సీ నటిగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మలయాళంలో ఆమె సెక్సీ నటనకు మంచి ఆదరణ లభించింది. అప్పట్లో మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి టాప్ స్టార్లు కూడా షకీలా సినిమాలు విడుదలవుతున్నాయంటే తమ తమ సినిమాలను విడుదల చేసేందుకు వెనుకాడేవారు. అదేవిధంగా షకీలాకు సంబంధించిన ఒక్క సన్నివేశమైనా తమ సినిమాల్లో చేర్చాలని భావించే దర్శకులు చాలా మంది ఉన్నారు.

ఆ తర్వాత తమిళంలో అవకాశాలు తగ్గడంతో స్మాల్ స్క్రీన్, వెండితెర చిత్రాల్లో నటిస్తుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.. తనకు ఎదురైన సమస్య గురించి మాట్లాడింది. అందులో మా అమ్మ అనారోగ్యంతో ఉన్నారు. నేను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాను. అప్పుడు డాక్టర్ రాసిన మందుల చిటీ అర్థం కాకపోవడంతో దాని గురించి అడిగాను. హఠాత్తుగా వచ్చి తాకకూడని ప్రదేశాన్ని తాకాడు. ఏమీ ఆలోచించకుండా డాక్టర్ని చెంపదెబ్బ కొట్టి తిట్టాను. బయట ఉన్న నర్సు వచ్చి నన్ను శాంతింపజేసి పంపించింది’’ అంటూ తనకు ఎదురయినా చెడు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

Also Read: KTR: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బిఆర్ఎస్ కావాలా: కేటీఆర్